Construction of one lakh flats under Cure: హైదరాబాద్‌తో పాటు ఇతర అర్భన్ ఏరియాల్లో దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేసేలా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ‘క్యూర్’ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో ఫ్లాట్ల నిర్మాణానికి గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా లో ఇన్‌కమ్ గ్రూప్ (ఎల్‌ఐజీ), మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ (ఎంఐజీ) ఫ్లాట్లను నిర్మించేందుకు హౌసింగ్ బోర్డుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిష్టాత్మక పథకం కింద అర్హులైన దిగువ, మధ్య తరగతి ప్రజల కోసం మొత్తంగా లక్ష ఫ్లాట్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ నిర్మాణాలను దశలవారీగా చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా మొదటి విడత ‘పైలట్ ప్రాజెక్ట్’ కింద 12 వేల ఫ్లాట్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు హౌసింగ్ బోర్డుకు గృహ నిర్మాణ శాఖ కీలక అనుమతులు మంజూరు చేసింది.
Also read: Gurukul Exam Results: జేసీసెట్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల విడుదల. మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి..!
ఎల్‌ఐజీ ఫ్లాట్లకు రూ.5 లక్షల సబ్సిడీ..
ఈ ప్రాజెక్టులో అత్యంత నిరుపేదలు, దిగువ వర్గాల వారికి లబ్ధి చేకూర్చేలా ఎల్‌ఐజీ (ఎల్‌ఐజీ) ఫ్లాట్లకు భూమి యూడీఎస్ ఇవ్వడంతో పాటు అదనంగా రూ.5 లక్షల ఆర్థిక సబ్సిడీని కూడా ప్రభుత్వం అందించనుంది. తద్వారా సామాన్యుడికి సైతం ఫ్లాట్ కొనుగోలు భారం తగ్గనుంది.

