HomeతెలంగాణProtest : వర్షంలోనూ ఓపీఎస్ కోసం ఆవేదన.. సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే హరీశ్‌రావు

Protest : వర్షంలోనూ ఓపీఎస్ కోసం ఆవేదన.. సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే హరీశ్‌రావు

సిద్దిపేట, జూలై 30 (తెలుగుప్రభ): వర్షం జోరుగా కురుస్తోంది… మైదానం  మైదానం జలమమయమైంది.. అయినా సీపీఎస్ ఉద్యోగుల అడుగులు మాత్రం కదలేదు. చేతుల్లో గొడుగులు, మనసులో భవిష్యత్తుపై ఆందోళనతో ఉద్యోగులు గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో నిరసన చేపట్టారు.  వివరాల్లోకి వెళ్లితే…సీపీఎస్‌  రద్దు కోసం సిద్ధిపేటలో సీపీఎస్‌  ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒకే రాజ్యాంగం -ఒకే పెన్షన్ అనే నినాదంతో 2004 తర్వాత నియామాకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బహిరంగ సమావేశంను నిర్వహించారు. 

- Advertisement -

ఈ నిరసన కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు తన్నీరు  హరీశ్‌రావు హాజరై ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు తన మద్దతు ఉంటుందని పేర్కొంటూ వారి పోరాటానికి అండగా నిలిచారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు మీటింగ్‌ ప్రారంభించిన కొద్ది సేపటికే వర్షం మొదలైంది. ఈ  వర్షంలోనే ఉద్యోగులు గొడులు పట్టుకుని తమ గళాన్ని వినిపించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తడుస్తూనే నినాదాలు చేస్తూ, తమ కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గొడుగుల నీడలో నిలబడి చేసిన ఈ నిరసన అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. వర్షం ఎంత తీవ్రంగా కురిసినా, తమ హక్కుల కోసం పోరాటం ఆపేది లేదనే సంకల్పాన్ని సీపీఎస్ ఉద్యోగులు మరోసారి పాలకులకు చాటి చెప్పారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News