Criminal case registered on KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై క్రిమినల్ కేసులు నమోదు నమోదైంది. హన్మకొండలో జరిగిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి.
పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: రాహుల్ గాంధీపై కేటీఆర్ అభ్యంతరకర రీతిలో నోరు పారేసుకున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మేరకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి తదితరులు వరంగల్‌లోని సుబేదారి పోలీసులకు కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు.
Also read-Bandi Sanjay: ధాన్యం కొనుగోళ్లలో రేవంత్ సర్కార్ విఫలం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్!
పలు సెక్షన్ల కింద కేసు నమోదు: రైతు సదస్సులో కేటీఆర్ చేసిన ప్రసంగం రెచ్చగొట్టేలా ఉందని.. దీనివల్ల సమాజంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సుబేదారి సీఐ మేకల రంజిత్ కుమార్ కేసు నమోదు చేశారు. కేటీఆర్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 504, 505 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

