HomeTop StoriesShamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రాకపోకలకు అంతరాయం.. ఈ విమానాల దారి మళ్లింపు..!

Shamshabad Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రాకపోకలకు అంతరాయం.. ఈ విమానాల దారి మళ్లింపు..!

Disruption to flight operations at Shamshabad Airport: గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు-మెరుపులు, బలమైన గాలులు వీచడంతో విమానాల ల్యాండింగ్, టేకాఫ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతికూల వాతావరణంతో ఏర్పడిన టెక్నికల్‌ సమస్యల కారణంగా అధికారులు పలు విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు పేర్కొన్నారు. ముంబై, ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, సింగపూర్‌ నుంచి వచ్చే విమానాలపై ఈ ప్రభావం అధికంగా ఉందని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం, ఎయిర్‌పోర్టు పరిసరాల్లో ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాల ల్యాండింగ్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవని అధికారులు చెబుతున్నారు. దీంతో, కొన్ని విమానాలకు తాత్కాలికంగా అనుమతి నిరాకరించారు. విమానాల మళ్లింపుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

- Advertisement -

Also read: Maggi noodles : మ్యాగీలో పురుగుల కలకలం: నెట్టింట ప్రచారంపై నెస్లే పక్కా క్లారిటీ!

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News