Degree admissions: తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘దోస్త్’ (Degree Online Services, Telangana – DOST) నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి (TGCHE) కార్యాలయంలో ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు.
నేటి సమావేశంలో వెల్లడించనున్న అంశాలు: ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి గారు అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్‌ను విడుదల చేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం మరియు ముగింపు తేదీలను తెలియజేయనున్నారు. అంతేకాకుండా వివిధ విడతల వారీగా కొనసాగే కౌన్సెలింగ్ తేదీలను సైతం పేర్కొననున్నారు.
Also read-Breaking: ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
సీట్ల కేటాయింపు వివరాలు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ మరియు స్వయంప్రతిపత్తి (Autonomous) డిగ్రీ కళాశాలల్లో సీట్ల భర్తీ ఈ ‘దోస్త్’ ప్రక్రియ ద్వారానే జరగనుంది. విద్యార్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

