Moinabad Drugs Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఏపీ, తెలంగాణకి చెందిన ప్రజాప్రతినిధులు ఈ కేసులో పట్టుబడటమే ఇందుకు కారణం. శనివారం రాత్రి మొయినాబాద్‌లోని ఆజీజ్‌నగర్ ప్రాంతంలోని బీఎంఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీపై ఈగల్ టీం దాడి చేసింది. పార్టీలో పాల్గొన్న వారు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఈగల్ టీం అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఈగల్ బృందం కీలక ప్రకటన విడుదల చేసింది.
Also Read: https://teluguprabha.net/telangana/rythu-bharosa-funds-2026-rabi-season-release-on-march-22nd/
మెయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసుపై ఈగల్ టీం కీలక వ్యాఖ్యలు చేసింది. శనివారం రాత్రి మొయినాబాద్ ఫామ్‌హౌస్‌పై దాడి చేసినట్లు తెలిపింది. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, అక్రమ పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. దాడి సమయంలో పోలీసులు ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టారని.. ఓ మహిళతో సహా 11 మంది వ్యక్తులు మద్యం సేవిస్తూ పట్టుబడ్డారని వెల్లడించింది. అనుమానాస్పద నార్కోటిక్ పదార్థాలు వినియోగిస్తున్నట్లు గుర్తించామని చెప్పింది. తనిఖీల సమయంలో ఫామ్‌హౌస్‌లో నుంచి పోలీసుల వైపు కాల్పులు జరిగాయని.. పోలీసులు వేగంగా లోపలికి ప్రవేశించి అందరినీ అదుపులోకి తీసుకున్నారని వివరించింది.
Also Read: https://teluguprabha.net/telangana/ktr-response-on-moinabad-drugs-case/
కాగా, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఈ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో రాజకీయ, వ్యాపార, రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నాట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో NDPS యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసినట్లు ఈగల్ టీం అధికారులు తెలిపారు.

