HomeTop StoriesAakunuri Murali resigns: సంచలనం.. ఆకునూరి మురళి ఆకస్మిక రాజీనామా?.. అసంతృప్తే కారణమా?

Aakunuri Murali resigns: సంచలనం.. ఆకునూరి మురళి ఆకస్మిక రాజీనామా?.. అసంతృప్తే కారణమా?

Education Commission Chairman Aakunuri Murali resigns: మాజీ ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు పంపించి, రాజీనామాకు గల కారణాలను లేఖలో వివరించారు. కాగా, సీఎం రేవంత్‌ వద్దే ఉన్న విద్యా శాఖకు పిలిచి మరీ సీఎం ఆకునూరి మురళిని కవిషనర్‌గా నియమించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం, సంస్కరణల కోసం ఆయన ప్రభుత్వానికి అనేక సిఫార్సులు చేశారు. అయితే, స్వయంగా సీఎం ఆయనకు ఇంతటి కీలక బాధ్యతలు అప్పగించినప్పటికీ ఎందుకు రాజీనామా చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన పదవీ కాలం ముగియడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే, ముందస్తుగా పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు రాజకీయ, విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

Also read: Bandi Bhagirath: బండి భగీరథ్ కేసులో బిగ్‌ ట్విస్ట్.. కస్టడీ పిటిషన్‌ విచారణ వాయిదా

రాజీనామాకు గల కారాణాలివేనా?

తన రాజీనామాకు గల కారణాలను ఆకునూరి మురళి సీఎస్‌కు పంపిన లేఖలో స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యా కమిషన్ చైర్మన్‌గా తనకు అప్పగించిన బాధ్యతలను, పనిని విజయవంతంగా పూర్తి చేశానని, తాను అనుకున్న లక్ష్యాలు నెరవేరినందున పదవి నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై నిరంతరం గళమెత్తే ఆకునూరి మురళి.. విద్యా వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వానికి అనేక కీలక సిఫార్సులు చేశారు. అయితే, ఇంకా నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే సడెన్‌గా తప్పుకోవడం వెనుక కేవలం పని పూర్తి కావడమే కారణమా? లేక ప్రభుత్వంపై అసంతృప్తితో రాజీనామా చేశారా? అంతర్గతంగా మరేదైనా కారణాలున్నాయా? అసలు సీఎం శాఖలో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆకునూరి మురళి ఆకస్మిక రాజీనామాపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News