Education Reforms by Commission: తెలంగాణ సర్కార్‌కు విద్యా కమిషన్ కీలక సూచనలు చేసింది. టీచర్లకు ఆటోమెటిక్ పదోన్నతుల రద్దును ప్రతిపాదిస్తూ వారి పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని సూచించింది. ఐదేళ్లకు ఒకసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా తప్పనిసరి అని పేర్కొంది. రెండేళ్లలో మెరుగుపడకపోతే సర్వీసు నుంచి తొలగించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని పేర్కొంది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల పదోన్నతులపై సమీక్ష నిర్వహించిన తెలంగాణ విద్యాకమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదని.. వారి పని తీరు ఆధారంగానే ప్రమోషన్లు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికను గురువారం సమర్పించింది. ఈ మేరకు విద్యా విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రంగా ఉండాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసింది. కమిషన్ నివేదికలో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు..
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-suggestions-to-group-1-and-2-new-employees/
ఐదేళ్లకోసారి సమీక్ష
‘ఉపాధ్యాయుల పని తీరును ప్రతి అయిదేళ్లకోసారి అంచనా వేయాలి. దాని ఆధారంగా ఆ ఉపాధ్యాయునికి ఒక నివేదిక అందజేయాలి. పని తీరు మెరుగుపర్చుకోవడానికి టీచర్‌కు రెండేళ్లు సమయం ఇవ్వాలి. అప్పటికీ పని తీరు మెరుగుపడకపోతే సర్వీసు నుంచి తొలగించాల్సిందే. పని తీరు మెరుగ్గా ఉంటేనే ప్రమోషన్లు ఇవ్వాలి. అయితే ఇప్పటికే సర్వీసులో ఉన్న వారికి ఈ నిబంధనలు వర్తించవు. ఇక నుంచి నియమించే ఉపాధ్యాయులకు వర్తింపజేయాలి.’
మరోవైపు బీఎడ్‌ను పునర్వ్యవస్థీకరించాలని సర్కార్‌కు కమిషన్ సిఫార్సు చేసింది. డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యకేషన్ (D.EI.ED)ను రద్దు చేయాలని సూచించింది. నర్సరీ నుంచి అయిదో తరగతి వరకు బీఎడ్(ప్రైమరీ), 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బీఎడ్(సెకండరీ) ఉంచాలని పేర్కొంది. ఇందుకు ఎన్‌సీటీఈతో సంప్రదించాలని వెల్లడించింది. బీఎడ్ విద్యార్థులకు పాఠశాలల్లో 150 రోజుల బోధనాభ్యాసం తప్పనిసరి చేయాలంది. బోధనా మాధ్యమంగా ఇంగ్లీష్ ఉండాలన్న కమిషన్.. నర్సరీ నుంచి యూనివర్సిటీల వరకు ఇంగ్లీష్ మాధ్యమంలోనే బోధించాలని సూచించింది. ఈ మేరకు త్రిభాష విధానం ఒకటో తరగతి నుంచే అమలు చేయాలని వివరించింది.
అయితే పూర్వ ప్రాథమిక విద్య నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలను ప్రాథమిక పాఠశాలల్లో బోధించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. పాఠశాల్లలో విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియామకం, వసతుల కల్పన, నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకు స్కూల్ డిస్ట్రిక్‌లను ఏర్పాటు చేయాలని ఈ మేరకు విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. పాఠశాలల్లో వంట వండే మహిళలకు వారానికి ఒకసారి చెల్లింపులు చేయాలని.. మధ్యాహ్న భోజన అంచనాలు, ప్రతిపాదనలు, చెల్లింపుల కోసం సమగ్ర సాఫ్ట్‌వేర్ వాడాలని సూచించింది.
Also Read: https://teluguprabha.net/telangana/minister-ponguleti-srinivas-reddy-comments-on-ktr-and-harish-rao/
అంతేకాకుండా ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించి విధివిధానాలపై సర్కారుకు విద్యా కమిషన్ కీలక సూచనలు చేసింది. IIT-JEE/ NEET కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లను నియంత్రించేందుకు చట్ట సవరణ చేయాలని పేర్కొంది. ఫీజులు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, తప్పుదారి పట్టించే ప్రకటనలపై నియంత్రణ అవసరమని తెలిపింది. ప్రైవేటు జూనియర్ కళాశాలల నుంచి పోటీ పరీక్షల కోచింగ్‌ను వేరు చేయాలంది. 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలని.. EAPCET రద్దు చేసి ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ప్రవేశాలు 12వ తరగతి మార్కుల ఆధారంగా కేటాయించాలని సూచన చేసింది. SSC, ఇంటర్మీడియట్ బోర్డులను విలీనం చేయాలిని.. విద్యా ప్రమాణాలు మెరుగుపర్చడానికి కనిష్ఠ ఉత్తీర్ణత శాతాన్ని 45 శాతానికి పెంచాలని నివేదికలో కీలక పాయింట్లు ప్రస్తావించింది.

