హైదరాబాద్, సెప్టెంబర్ 7 (తెలుగుప్రభ): తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం గడువు పొడిగించింది. క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు తొలుత సెప్టెంబరు 16 వరకు ఉన్న గడువును అక్టోబరు 7 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సోమవారం సవరించిన షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబరు 7 వరకు అందిన క్లెయిమ్స్, అభ్యంతరాలను అధికారులు పరిశీలించి పరిష్కరించనున్నారు. ఈ ప్రక్రియను నవంబరు 5లోగా పూర్తి చేయాలని ఈసీ నిర్ణయించింది. అనంతరం నవంబరు 9న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఓటర్ల నమోదుతో పాటు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి అర్హులైన వారు గడువులోగా క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది. గడువు పొడిగింపును అర్హులైన ప్రతి ఓటరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
SIR: అక్టోబర్ 7 వరకు ‘సర్‘.. మరోసారి పొడిగించిన ఎన్నికల సంఘం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

