Jaggareddy about Elections: తన జీవితంలో ఇకపై ఎన్నడూ సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం చేసినా తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/again-anil-ravipudi-and-venkatesh-combo-fixed/
కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జీవితంలో సంగారెడ్డి నుంచి పోటీ చేయనంటూ స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐసీసీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ.. స్వయంగా వచ్చి తనకోసం ప్రచారం చేసినప్పటికీ ఇక్కడి ప్రజలు తనను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఓటమికి ప్రధాన కారణం ఓటేసిన ప్రజలు కాదని.. ముఖ్యంగా మేధావులు, పెద్దలు తనను ఓడించారని అన్నారు. ఈ ఓటమిని తాను తీవ్ర అవమానంగా భావిస్తున్నానని.. రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి అవమానించానేమోనని ఫీల్ అయినట్లు వెల్లడించారు.
భవిష్యత్తులో సంగారెడ్డి నుంచి తన భార్య నిర్మల జగ్గారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఆమె తరపున కూడా నేను ప్రచారానికి రాను. ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినా, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్క సంగారెడ్డిలో తప్ప ఎక్కడైనా ప్రచారం చేస్తా.నని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
Also Read: https://teluguprabha.net/international-news/khamenei-alleged-that-trump-reason-for-protests-in-iran/
కాగా, జగ్గారెడ్డి భార్య టి. నిర్మల జగ్గారెడ్డి ప్రస్తుతం TGIIC చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నుంచి చింతా ప్రభాకర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

