HomeతెలంగాణMadhuyashki wife: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ భార్యకు తీవ్ర గాయాలు

Madhuyashki wife: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ భార్యకు తీవ్ర గాయాలు

Ex MP Madhuyashki wife seriously injured in Accident: నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కుటుంబంలో తీవ్ర ఆందోళన నెలకొంది. అమెరికాలో జరిగిన ఓ ఘోర కారు ప్రమాదంలో ఆయన భార్య డాక్టర్ సుచీ యాష్కీ తీవ్రంగా గాయపడ్డారు. మధుయాష్కీ గౌడ్ కుటుంబ సభ్యులు తమ కుమార్తె గగనను మెడిసిన్ ఉన్నత చదువుల నిమిత్తం కాలేజీలో జాయిన్ చేసేందుకు అమెరికా వెళ్లారు. కూతురి అడ్మిషన్ ప్రక్రియ ముగించుకుని వారు బోస్టన్ నగరం నుంచి తిరిగి న్యూయార్క్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మార్గమధ్యంలో భారీ వర్షం కురుస్తుండటంతో రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపైనే పలు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న మధుయాష్కీ భార్య డాక్టర్ సుచీ యాష్కీకి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పక్కటెముకలు విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం. అయితే, ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న మధుయాష్కీ గౌడ్‌ అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సుచీ యాష్కీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

- Advertisement -

Also Read: Ponguleti: తెలంగాణలో పెరిగిన భూముల మార్కెట్‌ వాల్యూ.. రేపటి నుంచే అమలు.. ఎక్కడ ఎంత పెరిగిందంటే..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News