HomeతెలంగాణHMWSSB: జలమండలిలో ఉద్యోగాలంటూ ఫేక్‌ నోటిఫికేషన్‌ వైరల్‌.. అధికారుల కీలక ప్రకటన..!

HMWSSB: జలమండలిలో ఉద్యోగాలంటూ ఫేక్‌ నోటిఫికేషన్‌ వైరల్‌.. అధికారుల కీలక ప్రకటన..!

Fake job notification in HMWSSB: నిరుద్యోగులకు ఉద్యోగాలంటూ అనేక ఫేక్‌ నోటిఫికేషన్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఫేక్‌ వెబ్‌సైట్లలో అప్లికేషన్లు తీసుకొని, వారి నుంచి డబ్బులు దండుకుంటున్నారు. చివరికి యువతను నిలువునా ముంచేస్తున్నారు. సరిగ్గా, ఇలాంటి ఓ ఫేక్‌ ప్రకటన ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. హైదరాబాద్ జలమండలి (HMWSSB)లో ఉద్యోగాల భర్తీ పేరుతో సోషల్ మీడియాలో ఓ ఫేక్‌ ప్రకటన వైరల్‌గా మారింది. అయితే, ఈ ఫేక్‌ ప్రచారాన్ని అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా కొంతమంది కేటుగాళ్లు సృష్టించిన నకిలీ పోస్టర్లపై జలమండలి క్లారిటీ ఇచ్చింది. ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ‘హైదరాబాద్ నీటి సరఫరా బోర్డు, తెలంగాణ రిక్రూట్‌మెంట్‌-2026’ పేరుతో ఓ నోటిఫికేషన్ పోస్టర్ విపరీతంగా వైరల్ అవుతోన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది. వైరల్‌ అవుతున్న సదరు ఫేక్‌ నోటిఫికేషన్‌పై జలమండలి ఉన్నతాధికారులు స్పందించారు. సదరు పోస్టర్‌లో పేర్కొన్న విధంగా బోర్డు ఎలాంటి నియామక ప్రక్రియను చేపట్టలేదని అధికారులు స్పష్టం చేశారు. అదంతా అసత్య ప్రచారమేనని, ఆ ఫేక్ నోటిఫికేషన్‌తో జలమండలికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. నిరుద్యోగులు ఇలాంటి నకిలీ పోస్టర్లను, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు.

- Advertisement -

Also Read: Thummala nageswara rao: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. 50 శాతం సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News