Homeతెలంగాణకరీంనగర్Farmers Protest: విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం.. ధర్నా, రాస్తారోకో

Farmers Protest: విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం.. ధర్నా, రాస్తారోకో

  • విద్యుత్ కోతలపై రైతుల ఆగ్రహం.. ధర్నా, రాస్తారోకో
  • పొలాలు ఎండుతున్నాయంటూ ఆందోళన
  • సిరిసిల్ల-కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయింపు

గంభీరావుపేట, అక్టోబర్ 5 (తెలుగు ప్రభ): అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రైతులు గంభీరావుపేట మండలం రాజేశ్వరరావు నగర్‌లోని సిరిసిల్ల-కామారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించారు. లోవోల్టేజీ కారణంగా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్ సరఫరా జరిగేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో 12 గంటలు కూడా విద్యుత్ సరఫరా జరగడం లేదని మండిపడ్డారు. విద్యుత్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని వాపోయారు.

- Advertisement -

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరాటంకంగా ప్రతిరోజూ ఐదు గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు రైతులతో మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మల్లుపల్లి, రాజేశ్వరరావు నగర్ కాలనీ సర్పంచ్‌లు సత్యం, పిట్ల బాబు, బీఆర్‌ఎస్ నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్, మోతే రాజిరెడ్డి, కమ్మరి రాజారాంతో పాటు పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News