HomeTop StoriesGandhi Bhavan: నువ్వా నేనా చూసుకుందాం రా..! గాంధీ భవన్‌లో తన్నుకున్న నేతలు.. మంత్రుల ముందే...

Gandhi Bhavan: నువ్వా నేనా చూసుకుందాం రా..! గాంధీ భవన్‌లో తన్నుకున్న నేతలు.. మంత్రుల ముందే బాహాబాహీ..!

Fight at Gandhi Bhavan: గాంధీ భవన్‌లో నిర్వహించిన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్‌ సమావేశంలో నేతలు బాహాబాహీకి దిగారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అజహరుద్దీన్‌ సమక్షంలోనే నేతలు ఫిరోజ్‌ఖాన్‌, ఉస్మాన్‌ అల్‌ హజ్రీ ఒకరినొకరు తన్నుకున్నారు. ప్రొటోకాల్‌ విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. అజహరుద్దీన్‌ పక్కన కూర్చునే అంశంలో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఉస్మాన్ అల్‌ హజ్రీ నెట్టివేయడంతో ఫిరోజ్‌ఖాన్‌ కిందపడిపోయారు.

- Advertisement -

Also read: ITR Filing: అందుబాటులోకి ఐటీఆర్‌-2 ఫారమ్‌.. ఎవరు ఫైలింగ్‌ చేయొచ్చంటే?

హనుమంత రావు వారిస్తున్నా వినకుండా..

ఇద్దరి మధ్య ఘర్షణను అడ్డుకునేందుకు సీనియర్‌ నేత వీహెచ్‌ ప్రయత్నించగా… ఆయన్ను కూడా నెట్టివేసేలా వ్యవహరించడంతో సీనియర్‌ నేతలు అడ్డుకున్నారు. ఈ పరిణామంతో మంత్రి అజహరుద్దీన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో సమావేశం ముగిసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. ఈ పరిణమంతో గాంధీ భవన్‌లో ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ.. మరీ మంత్రుల ముందే కొట్టుకోవడాన్ని చూసి పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News