HomeTop StoriesMedical Posts: గుడ్‌న్యూస్‌.. మెడికల్‌ కాలేజీల్లో 433 పోస్టుల భర్తీ పూర్తి.. ఫైనల్‌ లిస్ట్ రిలీజ్..!

Medical Posts: గుడ్‌న్యూస్‌.. మెడికల్‌ కాలేజీల్లో 433 పోస్టుల భర్తీ పూర్తి.. ఫైనల్‌ లిస్ట్ రిలీజ్..!

Final List Releases of Teaching posts in medical colleges: తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ రిలీజైంది. ఈ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. గత నెలలో ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున (1:3) అభ్యర్థులతో ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్టు విడుదల చేసిన బోర్డు.. మే 22, 23 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టి తాజాగా ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది.

- Advertisement -

Also read: CM Revanth Reddy: కేవలం మనకే కాదు యావత్‌ ప్రపంచానికే ఫ్యూచర్‌ సిటీ..! సీఎం రేవంత్‌ కామెంట్స్‌

త్వరలోనే వారికి నియామక పత్రాలు..

కాగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 34 డిపార్ట్‌మెంట్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గతేడాది మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పీడియాట్రిక్‌, ఆర్థోపెడిక్స్‌, గైనకాలజీ, అనస్థీషియా విభాగాలకు సంబంధించి 174 పోస్టుల భర్తీ ప్రక్రియ గతంలోనే పూర్తి చేసిన అధికారులు.. మిగతా 30 విభాగాల్లో 433 పోస్టులకు ఎంపిక ప్రక్రియను తాజాగా పూర్తి చేశారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందనలు తెలిపారు. త్వరలోనే వారికి నియామక పత్రాలు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. వారంతా త్వరలోనే ఉద్యోగాల్లో చేరనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News