HomeతెలంగాణFire Accident: కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. చెలరేగుతున్న మంటలు

Fire Accident: కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. చెలరేగుతున్న మంటలు

Fire Accident Gaddapotharam: సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామిక వాడలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. న్యూట్రన్‌ మహాలక్ష్మి సాల్వెంట్‌ కెమికల్ పరిశ్రమలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సాల్వెంట్‌ కెమికల్ డ్రమ్ములు పేలడంతో అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం. కిలోమీటర్‌ మేర దట్టంగా పొగ కమ్ముకోగా.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/jeevan-reddy-to-join-brs-on-april-20th/

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూట్రన్ మహాలక్ష్మి సాల్వెంట్స్ కెమికల్ ఫ్యాక్టరీలో కెమికల్ డ్రమ్ములు ఒకదాని తర్వాత ఒకటి పేలడంతో మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. అయితే, ఫ్యాక్టరీలోని యంత్రాలు, నిల్వ ఉంచిన కెమికల్స్ పూర్తిగా దగ్ధమవడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మంటలు పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా అధికారులు ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News