HomeTop StoriesAmeerpet: అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో వేగంగా అంటుకున్న మంటలు..!

Ameerpet: అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో వేగంగా అంటుకున్న మంటలు..!

Fire Accident in Ameerpet Shopping Complex: అమీర్‌పేటలోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోచింగ్‌ సెంటర్లకు అడ్డాగా పేరొందిన మైత్రీవనం కాంప్లెక్స్‌ సమీపంలోని మెట్రో పిల్లర్‌ నెంబర్ 1043 ఎదురుగా ఉన్న ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌ రెండో అంతస్తులో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రెండో అంతస్తులోని కేఎస్‌ఆర్‌ ఫ్యాషన్స్‌ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర దుకాణాలకూ వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి 3 ఫైరింజన్లు, 8 వాటర్‌ ట్యాంకర్లతో మంటలు అదుపు చేశారు. ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయించారు.

- Advertisement -

Also read: CM Chandrababu: విధ్వంస పాలనకు పాతరేసి నేటికి రెండేళ్లు.. ఏపీ ప్రజలకు ధన్యవాదాలు.. సీఎం చంద్రబాబు ట్వీట్‌

అమీర్‌పేటలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌..

అమీర్‌పేటలోని ప్రధాన రహదారికి సమీపంలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. దట్టమైన పొగ అలముకోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో దుకాణాల్లో సిబ్బంది బయటకు పరుగులు తీయడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. అయితే, ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌లో హెల్మెట్‌ షాపు ఉండటంతో ప్లాస్టిక్‌ సామాగ్రి దగ్ధమై మంటల వేగంగా వ్యాపించాయని, మంటల తీవ్రత ఎక్కువగా ఉందని అగ్నిమాపకశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News