HomeTop StoriesBalka Suman arrest: బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ అరెస్ట్.. నాంపల్లి కోర్టు వద్ద భారీ...

Balka Suman arrest: బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌ అరెస్ట్.. నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు..!

Former BRS MLA Balka Suman arrest: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ యువ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు శనివారం ఉదయాన్నే అరెస్ట్ చేశారు. సింగరేణి సంస్థపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారు. మరికాసేపట్లో ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు.

- Advertisement -

Also read: Amitabh praises Vaibhav: నీ వయసులో మేం గల్లీ క్రికెట్ కూడా ఆడలేదు.. వైభవ్‌ను ఆకాశానికెత్తిన అమితాబ్‌

ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..

ఇటీవల సింగరేణి జీఎం కార్యాలయాన్ని తగలబెట్టాలంటూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అంతటితో ఆగకుండా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలందరూ మిలిటెంట్ తరహాలో ఉద్యమాలు, పోరాటాలు చేయాలని అవసరం ఉందని పిలుపునిచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌లు ఫిర్యాదు చేశారు. దీంతో, ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. బాల్క సుమన్ అరెస్ట్ వార్తతో నాంపల్లి కోర్టు పరిసరాల్లో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, తన అరెస్ట్ వార్తలను మాత్రం బాల్క సుమన్ ఖండించారు. తాను తెలంగాణ భవన్‌లోనే ఉన్నానని, అరెస్టు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News