Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు అంశంపై హైదరాబాద్ సీపీ వి.సి సజ్జనార్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. దీంతో ఈ అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సీరియస్ అయ్యారు. అయితే సజ్జనార్ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ ఏంటీ..? దానిపై హరీశ్ రావు ఎందుకు అభ్యంతరం తెలిపారో తెలుసుకుందాం.
రూల్స్‌కు విరుద్ధం: వి.సి సజ్జనార్ సజ్జనార్ తన పోస్టులో “అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు” అని పేర్కొనడంపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది విచారణ పూర్తయ్యాక కోర్టులు నిర్ణయించే అంశాన్ని ముందే మీరెలా నిర్ణయిస్తారని మండిపడ్డారు. ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్‌కు విరుద్ధంగా సజ్జనార్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
How a SIT chief @SajjanarVC can officially refer to the issue of phone tapping as “illegal” even before the matter has been examined and decided by a competent court of law.
Such a statement is not only legally unsustainable but also deeply disturbing coming from SIT chief.
— Harish Rao Thanneeru (@BRSHarish) February 2, 2026
ఎక్స్ వేదికగా హరీశ్ రావు ఓ పోస్టు: ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సిట్ చీఫ్ ముందే ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తోందని హరీశ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా హరీశ్ రావు ఓ పోస్టు పెట్టారు. విచారణ దశలోనే ఏ చర్యనైనా అక్రమమని తేల్చే అధికారం సిట్‍కు లేదని అన్నారు. భారత టెలిగ్రాఫ్ చట్టం, సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ఆధారంగా మాత్రమే ఏ ఫోన్ ఇంటర్ సెప్షన్ చట్టబద్ధమా లేదా అక్రమమా అనేది నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు.
సున్నిత అంశాలపై ఇలాంటి వ్యాఖ్యలా?: రాజకీయంగా సున్నితమైన అంశంలో విచారణ పూర్తి కాకముందే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని తెలిపారు. విచారణ పూర్తి కాకముందే దోషిగా ఒక వ్యక్తిని నిర్ధారించేలా పోస్టులు పెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరచడమే అవుతుందని అన్నారు. సజ్జనార్ పెట్టిన పోస్టు న్యాయవ్యవస్థ విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని తెలిపారు. సిట్ చీఫ్‍గా వ్యవహరిస్తున్న సజ్జనార్ కేసీఆర్‌ను ప్రతిపక్ష నేతగా ఎందుకు గుర్తించడానికి ముందుకు రావడం లేదో తెలంగాణ ప్రజలు అడుగుతున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు.
Also read-KTR: చట్టాన్ని గౌరవించని సిట్.. విచారణల పేరుతో ప్రభుత్వం కాలక్షేపం- కేటీఆర్
ప్రజల చేత జేజేలు.. వరుస వివాదాలు: గతంలో ఎక్కడ పని చేసినా తనదైన మార్క్ చూపిన వి.సి సజ్జనార్.. పలు కేసుల్లో ప్రజల చేత జేజేలు పలికించుకున్నారు. అయితే ఇటీవల ఆయనపై వస్తున్న వరుస విమర్శలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ జర్నలిస్టుల అరెస్టుల విషయంలో ఆయన మాట్లాడిన మాటలు రాజకీయంగా చర్చనీయాశంగా మారాయి. దీంతో సజ్జనార్ వ్యాఖ్యలను పలువురు జర్నలిస్టులు, రాజకీయ నేతలు ఆక్షేపించారు. ఈ వ్యవహారం ముగిసిపోగా తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విషయంలో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. దీంతో బీఆర్ఎస్ చేస్తున్న తాజా ఆరోపణల పట్ల సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

