KTR Comments On ‘SIR’ ‘సర్’(ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ మూడో దశ తెలంగాణలో జూన్ చివరి వారంలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ ప్రక్రియపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతల నుంచి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ‘సర్’ విధానం, పార్టీ సభ్యత్వ నమోదులపై ఇన్‌ఛార్జ్‌లకు దిశా నిర్దేశం చేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/army-chief-upendra-dwivedi-warning-to-pakistan/
దేశంలో SIR జరగడం మొదటిసారి కాదని.. కానీ బీజేపీ ఆధ్వర్యంలోని NDA అధికారంలోకి వచ్చాక ఈ విధానంలో పూర్తిగా గందరగోళం నెలకొందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికలలో లబ్ధి పొందడానికి బీజేపీ ఈ ప్రక్రియ కోసం ఎదురుచూస్తోందని ఆరోపించారు.
‘రాష్ట్రంలో SIR కోసం బీజేపీ వాళ్లు ఎదురుచూస్తున్నారు. బిహార్ వంటి రాష్ట్రాల్లో ఓట్లు భారీగా గల్లంతు కావడంపై నేను ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి నేను లేఖ రాశా. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం పేపర్ బ్యాలెట్ పెట్టాలని ఈసీని గట్టిగా డిమాండ్ చేశాం. SIRలో బతికున్న వాళ్లను కూడా చనిపోయినట్టు చూపిస్తున్నారు. తెలంగాణలో త్వరలో ప్రారంభం కాబోతున్న ‘సర్’ ప్రక్రియలో అధికార కాంగ్రెస్, బీజేపీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లను చేర్చడం లేదా నిజమైన ఓటర్ల పేర్లను తొలగించే అవకాశం ఉంది. అందువల్ల బూత్ స్థాయి ఏజెంట్లు ప్రతి ఓటును కాపాడుకుంటూ, క్షేత్రస్థాయిలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి.’- కేటీఆర్
Also Read: https://teluguprabha.net/telangana/kavitha-letter-to-pm-modi-on-bandi-sanjay/
కాగా, తెలంగాణలో జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపు 35,000 మంది BLOలు ఈ ప్రక్రియలో పాల్గొంటారు. సర్వే పూర్తయిన తర్వాత జులై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు కొత్త ఓట్ల నమోదుకు, లేదా అభ్యంతరాలు తెలపడానికి అవకాశం ఉంటుంది.

