Saraswathi antya pushkaralu: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం కావడంతో భక్తులు రద్దీ పెరిగింది. ఈ క్రమంలో మాజీ మంత్రి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం కాళేశ్వరాన్ని సందర్శించారు. గోదావరి నది తీరానికి చేరుకుని.. శాస్త్రోక్తంగా పవిత్ర పుష్కర స్నానం ఆచరించారు.
ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు: నదీ స్నానం అనంతరం మల్లారెడ్డి కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Also Read-TSTDC: భక్తులకు గుడ్ న్యూస్.. సరస్వతి అంత్య పుష్కరాలకు ప్రత్యేక ప్యాకేజీ!
ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం: ఈ కార్యక్రమంలో మల్లారెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు పాల్గొన్నారు. మాజీ మంత్రి రాకతో కాళేశ్వరం ఆలయ పరిసరాల్లో కాసేపు సందడి వాతావరణం నెలకొంది.

