Telangana Women Commission Chairperson Vijaya Lakshmi: తెలంగాణ మహిళా కమిషన్ నూతన ఛైర్‌పర్సన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్. రామకృష్ణరావు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/cm-vijay-meets-dmk-chief-stalin-in-chennai/
ఇకపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి కొనసాగనున్నారు. అదేవిధంగా కమిషన్‌లో ఆరుగురు సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. వీరందరూ ఐదేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగుతారు.
తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతతో పాటు శశికళ యాదవ రెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా అసాయి షకిరా కమిషన్ సభ్యులుగా విధులు నిర్వర్తించనున్నారు.

