HomeతెలంగాణGandhari: బొలెరో, బైక్ ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు

Gandhari: బొలెరో, బైక్ ఢీ.. యువకుడికి తీవ్ర గాయాలు

గాంధారి, అక్టోబర్ 15 (తెలుగు ప్రభ): గాంధారి మండల కేంద్రంలోని శ్రీకృష్ణ ధాబా సమీపంలో భరత్ పెట్రోల్ బంక్ వద్ద బొలెరో వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో యువకుడు గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

- Advertisement -

కామారెడ్డి నుంచి తన స్వగ్రామమైన పోతంగల్ కలాన్‌కు బైక్‌పై వెళ్తున్న వడ్ల అరుణ్ (25)ను ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి కుడి కాలుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ కమలాకర్, పైలట్ ప్రకాష్ గౌడ్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు.

గాయపడిన అరుణ్‌ను అంబులెన్స్‌లోకి తీసుకుని, వైద్యాధికారి కాశిరెడ్డి సూచనల మేరకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితుడికి సకాలంలో వైద్య సేవలు అందించిన 108 అంబులెన్స్ సిబ్బందిని పలువురు అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News