Vehicle Theft Case Gang Arrested: సంగారెడ్డి జిల్లాలో వరుస వాహన దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో మినీ ట్రక్కులు, టిప్పర్ వాహనాలను దొంగిలిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీఎం వాహనం దొంగతనం కేసును ఛేదించి, రూ. 2 లక్షలు, 1 పిస్టల్, ఎయిర్ గన్, 2 కత్తులు, 6 సెల్‌ఫోన్లు, టిప్పర్ స్వాధీనం చేసుకున్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/vijay-unanimously-elected-as-tvk-legislature-party-leader/
ఒక రాష్ట్రంలో వాహనాలను దొంగిలించి, గుర్తింపు దొరక్కుండా మరో రాష్ట్రంలో విక్రయించేవారు. వీరు మొత్తం 11 దొంగతనాల కేసుల్లో(తెలంగాణలో 5, మహారాష్ట్రలో 5, కర్ణాటకలో 1) పాలుపంచుకున్నట్లు విచారణలో తేలింది. నారాయణఖేడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వీరిని పోలీసులు పట్టుకున్నారు. మహ్మద్ ఖుర్షీద్ అహ్మద్, మహ్మద్ జాఫర్ అలీ, సయ్యద్ సయీద్, షేక్ నిజాం, మహ్మద్ సలీం, మహ్మద్ ఇర్షాద్ అహ్మద్‌లను అరెస్ట్ చేయగా, మరో ఏడుగురు పరారీలో ఉన్నారు. సీసీఎస్ సంగారెడ్డి బృందం, నారాయణఖేడ్ పోలీసులు చాకచక్యంగా ఈ కేసును ఛేదించడంతో ఎస్పీ పరితోష్ పంకజ్ వారిని అభినందించారు.

