Tuesday, February 10, 2026
HomeతెలంగాణGarla: అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

Garla: అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగాన్ని రచించిన డా.బీఆర్‌ అంబేద్కర్‌ను ప్రతిఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ఎస్సై భానోత్ వెంకన్న విగ్రహ వ్యవస్థాపకులు నేతగాని నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావులు పేర్కొన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదే శానికి రాజ్యాంగం రచించి, దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వంతో పాటు పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు అంబేద్కర్‌ కృషి చేశారన్నారు.అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని ఆయన సూచించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు గుండా వెంకటరెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ శీలం శెట్టి ప్రవీణ్ కుమార్ గులగట్టు బాబు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బాపనపల్లి సుందర్ గుగులోత్ హరి తోడేటి శ్రీను యువజన నాయకులు యాకుబ్ పాషా మోదుగురు సాగర్ పిల్లలమర్రి వీరస్వామి లాల్ సింగ్ బొద్దు నరసింహారావు బాదావత్ రవి కోల కుమార్ జడ్జి గిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News