HomeTop StoriesTG Govt: ఫీజుల నియంత్రణకు చర్యలు.. అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీపై ప్రభుత్వం కీలక...

TG Govt: ఫీజుల నియంత్రణకు చర్యలు.. అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

TG Govt Fee Regulatory: ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ(TAFRC)ని పునర్‌వ్యవస్థీకరించింది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలరెడ్డిని ప్రభుత్వం నియమించింది. మొత్తం 11 మంది సభ్యులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/literary-writer-sky-baba-nominated-for-babumiya-bandwale-national-integration-award/

ప్రైవేట్ కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేయకుండా అడ్డుకోవడం, ఫీజుల ఖరారులో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యా నాణ్యత, విద్యార్థుల అకాడమిక్ పెర్ఫార్మెన్స్, ప్లేస్‌మెంట్స్, ఆధార్ ఆధారిత పేమెంట్స్, ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ వంటి పారామితుల ఆధారంగా ఇకపై ఫీజులను నిర్ణయించనున్నారు. అయితే ఈ కమిటీ నిబంధనలను అతిక్రమించి అదనపు ఫీజులు వసూలు చేసే కాలేజీలకు ఒక్కో విద్యార్థిపై రూ. 2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

Also Read: https://teluguprabha.net/top-stories/jagityala-jeevan-reddy-sensational-comments-on-cm-revanth-reddy/

వచ్చే మూడేళ్ల కాలానికి(2025-28) వివిధ వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ఖరారు చేసే ప్రక్రియను  కమిటీ ఇప్పటికే ప్రారంభించింది. ప్రస్తుతం ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస వార్షిక ఫీజు రూ. 45,000 నుంచి గరిష్ఠంగా రూ. 1.83 లక్షల వరకు ఉండేలా కమిటీ చర్యలు చేపడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News