Government working to implement new EHS Scheme: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రభుత్వం నూతన ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలు దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈహెచ్‌ఎస్ స్కీమ్ అమలు కోసం ఉద్యోగులు, పింఛనర్ల పూర్తి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశిస్తూ.. రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అలాగే రిటైర్డ్ ఉద్యోగుల వివరాలను అధికారిక పోర్టల్‌లో తక్షణమే అప్‌డేట్ చేయాలని ఆర్థిక శాఖ అన్ని శాఖల హెచ్‌వోడీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని, ఈ నెలాఖరు నాటికి ఉద్యోగులు, పెన్షనర్ల డేటా అప్‌డేట్ ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also read: Manchu Manoj: త్వరలోనే మంచు వారి కోడలి పొలిటికల్ ఎంట్రీ.. కన్ఫర్మ్ చేసిన మంచు మనోజ్..!
జూన్ 2న ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త హెల్త్‌కార్డులు..
కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఉద్యోగులు, పెన్షన్ పింఛనర్లందరికీ కొత్త హెల్త్‌కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మే 31లోపే ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల డేటాబేస్ సిద్ధం కావాల్సి ఉన్నందున, యుద్ధప్రాతిపదికన ఈ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించింది. కొత్త విధానం ద్వారా ఇకపై ఉద్యోగులకు మెరుగైన, క్యాష్‌లెస్ వైద్య సేవలు అందనున్నాయి.

