HomeTop StoriesEHS Board: ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌కు లైన్‌ క్లియర్‌.. ఈహెచ్‌ఎస్‌ బోర్డు నియమిస్తూ జీవో జారీ

EHS Board: ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌కు లైన్‌ క్లియర్‌.. ఈహెచ్‌ఎస్‌ బోర్డు నియమిస్తూ జీవో జారీ

Green signal for employees health scheme: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న హెల్త్‌ స్కీమ్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఉద్యోగుల సంరక్షణ, ఆరోగ్య భద్రత కోసం తీసుకొచ్చిన హెల్త్‌ స్కీమ్‌ పట్ల తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సరికొత్త ఆరోగ్య పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి వీలుగా ఎంప్లాయిస్ హెల్త్‌కేర్ ట్రస్ట్‌కు బోర్డు సభ్యులను నియమించింది. ఈ నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొద్ది సేపటి క్రితమే అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.

- Advertisement -

Also read: AP Inter supplementary: విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌.. రేపే ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు

29 మందితో ఈహెచ్‌ఎస్‌ బోర్డు ఏర్పాటు

ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఎంప్లాయిస్ హెల్త్‌కేర్ ట్రస్ట్ (EHCT) బోర్డుకు చైర్మన్‌గా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు పనిచేయనున్నారు. ఈ బోర్డులో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిపి మొత్తం 29 మంది సభ్యులను తీసుకున్నారు. ఇకపై రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి సంబంధించిన పూర్తి బాధ్యతలను ఈ ట్రస్టే పర్యవేక్షించనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్‌ లెస్‌ ట్రీట్‌మెంట్‌ అందించేలా, కొత్త హెల్త్ కార్డుల జారీకి సంబంధించిన పూర్తి విధివిధానాలను రూపొందించే బాధ్యతను ప్రభుత్వం ఈ ట్రస్ట్ బోర్డుకు అప్పగించింది. కొత్తగా ఏర్పాటైన ఈహెచ్‌సీటీ బోర్డు సభ్యులంతా వీలైనంత త్వరగా సమావేశమై, ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌కు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. దీని ద్వారా త్వరలోనే హెల్త్‌ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News