Gudem Mahipal Reddy Hot Comments: మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ (ఆదివారం) ముఖ్య అనుచరులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునివ్వడం సంచలనంగా మారింది. అప్పటి పరిస్థితుల వల్ల నియోజకవర్గ అభివృద్ది కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందన్నారు. అయితే, పార్టీలో చేరినప్పటికీ ఏం పటాన్‌చెరుకు ఎలాంటి లాభం జరుగలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశానని మనస్థాపానికి గురయ్యారు. మూడుసార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని, అదే పార్టీలో ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండంటూ హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు, ఇప్పటికే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ముఖ్యనేతలకు టచ్‌లో ఉన్నారనే వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే తన అనుచరులను ఒక్కొక్కరిని కారెక్కిస్తున్నారని టాక్. త్వరలోనే గూడెం మహిపాల్‌రెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తిరిగి ఆయన బీఆర్‌ఎస్ గూటికి చేరుతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపుల కేసులో గూడెం మహిపాల్ రెడ్డికి స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. కానీ, ఆ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. దీంతో ఏలాంటి ఇబ్బందులు వస్తాయని మహిపాల్ రెడ్డి తిరిగి గులాబీ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రాజీనామా చేస్తే గెలుపుపై సందేహంతో ఆయన యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Gudem Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా.. పటాన్‌చెరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

