HomeతెలంగాణGurukul Exam Results: జేసీసెట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాల విడుదల. మీ రిజల్ట్ ఇలా చెక్‌...

Gurukul Exam Results: జేసీసెట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫలితాల విడుదల. మీ రిజల్ట్ ఇలా చెక్‌ చేసుకోండి..!

Gurukul Junior College Entrance Exam Results: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్ష (జేసీసెట్‌) ఫలితాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ సెక్రటేరియట్‌లో విడుదల చేశారు. ఫలితాలను www.rjcet.telangana.gov.inవెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చని తెలిపారు. తాజా ఫలితాల ప్రకారం, ఇంటర్ ఫస్టియర్‌ ప్రవేశాలకు మొదటి విడతలో 18,401 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా 229 సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు 45,357 దరఖాస్తులు రాగా.. ఈ నెల 15న జరిగిన జేసీ సెట్‌కు 39,052 మంది విద్యార్థులు హాజరయ్యారు.

- Advertisement -

Also read: SC: స్వచ్ఛందంగా వేశ్యగా మారడం నేరం కాదు- వ్యభిచార వృత్తిపై సుప్రీంకోర్టు సంచలన మార్గదర్శకాలు 

జూన్‌ 7లోగా కాలేజీల్లో చేరాలి..

మొదటి విడతలో ఎంపికైన విద్యార్థులు జూన్ 7వ తేదీలోగా కాలేజీల్లో చేరాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విద్యార్థులను కోరారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అందుకే మా ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు, తల్లిదండ్రులకు అపారమైన నమ్మకం ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేలా గురుకులాలను నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. గతంలో జరిగిన ఫుడ్‌ పాయిజన్‌ బాధ్యులపై చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News