HomeTop StoriesHarish Rao: బడే భాయి విధానాలను అమలు చేస్తున్న ఛోటే భాయ్‌.. సీఎం తీరుపై మండిపడ్డ...

Harish Rao: బడే భాయి విధానాలను అమలు చేస్తున్న ఛోటే భాయ్‌.. సీఎం తీరుపై మండిపడ్డ హరీష్‌రావు

Harish Rao coments on Rythu DISCOM: తెలంగాణ రైతు డిస్కం అన్నదాతల పాలిట శాపంగా మారనుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతు డిస్కం వల్ల తాగునీటి ప్రాజెక్టులకు కూడా కరెంట్‌ కోతలు వస్తాయని చెప్పారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతు డిస్కం విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘తెలంగాణలో ప్రస్తుతం రైతులకు రోజుకు 13 గంటలకు మించి కరెంట్‌ సరఫరా చేయట్లేదు. అనధికారికంగా పవర్‌ కట్స్‌ అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ కరెంట్ కూడా ఇవ్వకుండా చేసే కుట్ర జరుగుతోంది. రైతు డిస్కం ఏర్పాటుతో కేవలం 7 నుంచి 8 గంటలే కరెంట్ ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో రైతులకు కేవలం 7 గంటలే విద్యుత్‌ ఇస్తున్నారు. బడే భాయి మోదీ విధానాలను ఇక్కడ అమలు చేసేందుకు ఛోటా భాయి ప్రయత్నిస్తున్నారు. రైతు డిస్కంలో సౌర విద్యుత్‌ మాత్రమే ఇస్తామని ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్పష్టంగా తెలియజేసింది. ఆ విద్యుత్‌తో ఎత్తిపోతల ప్రాజెక్టుల మోటార్లు ఎలా నడుస్తాయి?’’ అని హరీశ్‌రావు సీఎం రేవంత్‌ను సూటిగా ప్రశ్నించారు.

- Advertisement -

Also read: KTR: రైతు డిస్కం పేరుతో రేవంత్‌ కొత్త నాటకం.. మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కుట్ర.. కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News