HomeతెలంగాణHarish Rao: కాంగ్రెస్‌ పాలనలో ఎస్టీలకు తీవ్ర అన్యాయం.. లంబాడీల మహా ధర్నాలో హరీశ్‌రావు హాట్‌...

Harish Rao: కాంగ్రెస్‌ పాలనలో ఎస్టీలకు తీవ్ర అన్యాయం.. లంబాడీల మహా ధర్నాలో హరీశ్‌రావు హాట్‌ కామెంట్స్‌

Harish Rao Comments on congress: చిన్న తండాలను కూడా పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. లంబాడీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ఒక్క కేసీఆర్‌ మాత్రమేనని గుర్తు చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది.. అధికారికంగా వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. అంతేకాదు, బంజారాహిల్స్‌ వంటి అత్యంత ప్రైమ్‌ లొకేషన్‌లో బంజారాలకు ఆత్మగౌరవ భవనం కట్టించామని గుర్తు చేశారు.

- Advertisement -

Also read: Geopolitics : డీల్ అదిరింది.. డ్రాగన్‌కు దిమ్మతిరిగింది! భారత్-అమెరికా ల్యాండ్‌మార్క్ ఒప్పందం

రెండున్నరేళ్లయినా ఎస్టీలకు చేసిందేమీ లేదు..

మంగళవారం హైదరాబాద్‌లో లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మా ప్రభుత్వంలో టీఎస్‌ ప్రైడ్‌ ద్వారా 13,200 మంది గిరిజన యువతకు ఉద్యోగాలిచ్చాం. ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల కోసం డిగ్రీ కళాశాలలు కట్టించాం. సేవాలాల్‌, కుమురం భీం, ఏకలవ్య కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా ఆయా కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎస్టీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోంది.’’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News