Sunday, February 8, 2026
HomeతెలంగాణHarish Rao: రేవంత్‌కు దిమ్మ తిరిగే బదులిస్తాం.. హరీశ్‌ రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao: రేవంత్‌కు దిమ్మ తిరిగే బదులిస్తాం.. హరీశ్‌ రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao Hot Comments on Revanth Reddy: ఖమ్మం సభలో బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు హాట్‌ కామెంట్స్‌ చేశారు. రేవంత్‌ రెడ్డిది ద్రోహ చరిత్ర అంటూ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా రాసుకొచ్చారు. ”అడుగడుగునా వెన్నుపోట్లు, అనుక్షణం అబద్ధాలు.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్‌రెడ్డిది. ముమ్మాటికీ తెలంగాణ ద్రోహి రేవంత్. చంద్రబాబు పంచాన చేరి నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన దొంగ, ఓటుకు నోటు కేసు దొంగ రేవంత్. ఎన్టీఆర్‌ ద్వేషించిన కాంగ్రెస్‌లో చేరి.. నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు శిశ్యుడు.” అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ మాత్రం బీజేపీని మోస్తున్న టీడీపీపై అభిమానం కురిపించడం వెనుక మతలబు ఏంటి? అని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ కూటమికి మేలు చేసేలా రేవంత్ వ్యవహారశైలి ఉంది. ఆయన రాజకీయం చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోందన్నారు. సీఎం రేవంత్‌.. బీఆర్‌ఎస్‌ జెండా దిమ్మెలను కూల్చాలని పిలుపునివ్వడం అంటే శాంతిభద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమే అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ దిమ్మెలు కూలగొడితే రేవంత్‌కు దిమ్మతిరిగేలా బదులిస్తామంటూ హరీశ్ రావు ఎక్స్‌ వేదికగా రాసుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News