Sunday, February 8, 2026
HomeతెలంగాణHarish Rao: ఎన్ని నోటీసులు ఇచ్చినా సీఎం రేవంత్‌ని వదిలిపెట్టం- హరీశ్‌ రావు

Harish Rao: ఎన్ని నోటీసులు ఇచ్చినా సీఎం రేవంత్‌ని వదిలిపెట్టం- హరీశ్‌ రావు

MLA Harish Rao on SIT notices: ఎన్ని నోటీసులిచ్చినా సీఎం రేవంత్‌ రెడ్డిని వదిలిపెట్టబోమని మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సిట్‌ నోటీసులపై ఆయన స్పందించారు.

- Advertisement -

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. బీఆర్‌ఎస్‌ కీలక నేతలకు సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేయడంతో కాంగ్రెస్‌ సర్కార్‌పై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావుకు సిట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీపీ సజ్జనార్‌ ఆధ్యర్వంలో విచారణకు హాజరయ్యారు. కాగా, నేడు మాజీ మంత్రి కేటీఆర్‌కు సైతం సిట్‌ నోటీసులు జారీ చేసింది. దీనిపై హరీశ్‌ రావు ఘాటుగా స్పందించారు. 

Also Read: https://teluguprabha.net/telangana-news/tgsrtc-smart-cards-mahalakshmi-scheme-free-bus-travel/

నిన్న నాకు, ఇవ్వాళ కేటీఆర్‌కు నోటీసులు పంపారు. బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పే ధైర్యం లేకనే ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో ప్రజల దృష్టి మరలుస్తున్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. సీఎం రేవంత్‌ రెడ్డి వదిలిపెట్టం. 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేవరకూ వెంటపడతాం. అని హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు. 

Also Read: https://teluguprabha.net/national-news/congress-kharge-mgnrega-repeal-parliament-budget-session/

మరోవైపు కేటీఆర్‌కు నోటీసులపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి స్పందించారు. ఇదంతా కాంగ్రెస్‌ సర్కార్‌ నాటకం అని మండిపడ్డారు. పాలన గాలికి వదిలి సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న ప్రయత్నాలని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. రేవంత్‌ రెడ్డి రాష్ట్రాన్ని కర్మకు వదిలేసి దావోస్‌.. అటు నుంచి  అమెరికా పర్యటన పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News