HomeTop StoriesHeavy rains: నేడు, రేపు తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలలకు ఎల్లో అలర్ట్‌..!

Heavy rains: నేడు, రేపు తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలలకు ఎల్లో అలర్ట్‌..!

Heavy rain forecast for Telangana: తెలంగాణలో నేడు (మంగళవారం), రేపు (బుధవారం)ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. గత కొన్ని నెలలుగా తీవ్ర ఎండలు, ఉక్కపోతతో బెంబేలెత్తిన జనాన్ని వర్షపు చిరు జల్లులు పలకరించాయి. ఈ మేరకు రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఆయా జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాలకు సైతం మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు తెలిపిన వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక, కామారెడ్డిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే ఛాన్స్‌ ఉందని పేర్కొన్నారు. అలాగే, బుధవారం వికారాబాద్, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల ప్రజలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

- Advertisement -

Also read: Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో క్రేజీ ఫీచర్‌.. పోస్టులను రీ ఆర్డర్‌ చేసుకునే వెసులుబాటు

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం..

మరోవైపు, ఇవాళ సాయంత్రం భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తీవ్రతకు రామ్‌నగర్‌లోని వీఎస్టీ రోడ్డులో భారీ వృక్షం నేలకొరిగింది. అలాగే, హైదర్‌గూడలోనూ ఓ భారీ వృక్షం నేలకొరగడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు చేరి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇక, ముషీరాబాద్‌లో ఈదురుగాలులకు విద్యుత్‌ తీగలు తెగి పలు చోట్ల విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News