HomeTop StoriesHeavy Rains: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన.. అవసరమైతే తప్ప బయటికి రావొద్దంటూ హెచ్చరిక

Heavy Rains: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన.. అవసరమైతే తప్ప బయటికి రావొద్దంటూ హెచ్చరిక

Heavy rain is lashing Hyderabad traffic police warn: తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. అవరసరమైతే తప్ప బయటకి రావొద్దని, కంపెనీలు సాధ్యమైనంతవరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం అమలు చేయాలని సూచించారు. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. నేటి (గురువారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద్యోగులకు విడతల వారీగా ముందస్తు లాగౌట్ అమలు చేయాలని ఐటీ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రద్దీని కంట్రోల్‌ చేయడంతో పాటు అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా చూడడమే తమ లక్ష్యమని ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టం చేశారు. ప్రయాణ ప్రమాదాలు తగ్గించి, రహదారులపై ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడంలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఐటీ సంస్థలు తమ కార్యాలయం ఉన్న స్థలం, ముందస్తు లాగౌట్ సమయాలను తప్పకుండా సైబరాబాద్‌ ట్రాఫిక్ అఫీషియల్‌ ఈ-మెయిల్ ద్వారా తెలియజేయాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు రావొద్దని కోరారు. వర్షం పడుతున్న సమయంలో జాగ్రత్తగా ప్రయాణించాలని సైబరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -

Also Read: Almond Milk Nails: ప్రియాంక చోప్రా స్టైల్‌తో వైరల్.. ఆల్మండ్ మిల్క్ నెయిల్స్ ట్రెండ్

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News