Thursday, March 12, 2026
HomeTop StoriesiBOMMA Ravi: ఐబొమ్మ రవికి ఉపశమనం.. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు.!

iBOMMA Ravi: ఐబొమ్మ రవికి ఉపశమనం.. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు.!

iBOMMA Ravi Bail Petition: సినిమా పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇమ్మడి రవికి ఈ కేసులో తాజాగా తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/rangareddy-news/high-court-stay-on-ibrahimpatnam-municipal-chairman-election/

సినిమా పైరసీ కేసులో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవికి ఉపశమనం లభించింది. రవి బెయిల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రోజూ సీసీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఐబొమ్మ రవి పాస్‌పోర్ట్‌ను కోర్టులో సరెండర్‌ చేయాలని.. దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. ఇంటర్నెట్‌ వినియోగంపై ఆంక్షలు విధించిన ధర్మాసనం.. పోలీసుల అనుమతితో మాత్రమే ఇంటర్నెట్ వాడాలని స్పష్టం చేసింది. సాక్షులను ప్రభావితం చేయడం లేదా ఆధారాలను తారుమారు చేయడం వంటి పనులు చేయకూడదని హెచ్చరించింది.

Also Read: https://teluguprabha.net/telangana/nalgonda-news/lorry-hits-bike-on-sagar-left-canal-haliya-couple-died/

తెలుగు సినిమాలను హెచ్‌డీ క్వాలిటీతో ఐబొమ్మ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంతో.. చిత్ర పరిశ్రమకు రూ. వేల కోట్లు నష్టం కలిగిస్తున్నాడనే ఆరోపణలపై గతేడాది నవంబర్‌లో రవిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఈ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల నుంచి భారీగా ఆదాయం పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కాగా, గతంలో బెయిల్‌ కోరుతూ రవి ఐదు సార్లు నాంపల్లి కోర్టును ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది. దీంతో హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. విచారణ జరిపిన ధర్మాసనం.. షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News