Telangana MLAs Party Change High Court: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. స్పీకర్ సహా 9 మంది ఎమ్మెల్యేలు కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 6 కి వాయిదా వేసింది.
Also Read: https://teluguprabha.net/national-news/two-planes-collide-at-delhi-airport/
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు గురువారం కీలక విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో వివరణ ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహా 9 మంది ఎమ్మెల్యేలకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, వారు పార్టీ మారలేదని స్పీకర్ ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టులో సవాలు చేశారు.
Also Read: https://teluguprabha.net/telangana/telangana-leaders-angered-by-mp-tejasvi-suryas-comments/
ఈ నోటీసులు అందుకున్న వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, ప్రకాష్ గౌడ్, టి. సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు ఉన్నారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణను మే 6కి వాయిదా వేసింది. అప్పటిలోగా ప్రతివాదులందరూ తమ కౌంటర్ అఫిడవిట్‌లను దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

