Grey jungle fowl: ఈ కోడిని తింటే మూడేళ్ల జైలు శిక్ష. అవును మీరు చదివింది నిజమే. రోజువారీ మార్కెట్‌లో వందల క్వింటాళ్ల చికెన్ అమ్మకాలు సాగుతుండగా లేని శిక్షలు.. ఈ కోడిని తింటే తప్పేంటి అనుకుంటున్నారా?. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అదేంటో తెలుసుకుందాం!
మూడేళ్ల జైలు శిక్ష: ఈ కోడిని మాత్రం టచ్ చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇది గ్రామాల్లో పెరిగే సాధారణ కోడి కాదు.. కేవలం అడవుల్లో మాత్రమే జీవించే అరుదైన గ్రే జంగిల్ ఫౌల్ (అడవి కోడి). మన దేశంలో మాత్రమే కనిపించే ఈ ప్రత్యేక పక్షి జాతిని ప్రభుత్వం వన్యప్రాణి రక్షణ చట్టం కింద చేర్చింది. ఈ చట్టం ప్రకారం ఈ అడవి కోళ్లను వేటాడటం, విక్రయించడం లేదా ఆహారంగా తీసుకోవడం తీవ్రమైన నేరం. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాతో పాటు కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతంలో కెమెరా కంటికి చిక్కిన ఈ అడవి కోడి చిత్రం ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. దీని రక్షణపై అటవీ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచారు.

