- ఉప్పల్ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం
- నిరసనలో పాల్గొన్న హబ్సీగూడ డివిజన్ ప్రెసిడెంట్ కంది శ్రవణ్ కుమార్ రెడ్డి
- రోడ్డుపై బైఠాయించి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు
- రాహుల్ గాంధీ పై, విద్యార్థులపై దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన నేతలు
- ప్రధాని మోదీ దిష్టి బొమ్మ దహనం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
ఉప్పల్ (తెలుగుప్రభ): కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై దాడికి నిరసనగా ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. డిల్లీ జంతర్ మంతర్ వద్ద గత ఇరవై రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులు, యువకులపై లాఠీ ఛార్జ్ చేసి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు
నీట్ విద్యార్థులకు సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ పై ముక్కు నుంచి రక్తం వచ్చేలా అమానుషంగా దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ని,ప్రియాంక గాంధీ ని అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉప్పల్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అనంతరం, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ వైఫల్యానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డు పై భైరాయించి నిరసన తెలిపి ప్రధాని మోడీ దిష్టి బొమ్మ దహనం చేశారు.

నిరసన పాల్గొన్న నాయకులు వీల్లే..
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు బొప్పనపల్లి సుధాకర్ రెడ్డి, హబ్సీగూడ డివిజన్ ప్రెసిడెంట్ కంది శ్రవణ్ కుమార్ రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గణేష్ నాయక్, హబ్సీగూడ డివిజన్ మాజీ అధ్యక్షులు గన్నారం విజయ్ కుమార్, సీనియర్ నాయకులు చింతల బాబురావు, మురళీ కృష్ణ ముదిరాజ్, రాజు నాయక్, కిషన్ నాయక్, గుండు రాజన్న, మాలు నాయక్, గంగా యాదవ్, వాసు నాయక్, సాయి కుమార్, సాయి కిరణ్, సుమన్ నాయక్, మహబూబ్, శివ తదితరులు పాల్గొన్నారు.

బీరప్ప గడ్డ డివిజన్ ప్రెసిడెంట్ ఆగం రెడ్డి, వెంకట్ రెడ్డి నగర్ డివిజన్ ప్రెసిడెంట్ నామ్ రాజిరెడ్డి, రామంతపూర్ డివిజన్ ప్రెసిడెంట్ సందీప్, వర్కింగ్ ప్రెసిడెంట్ వల్లపు శ్రీకాంత్ యాదవ్.. ఉప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ పటేల్, సీనియర్ నాయకులు బాలయ్య బాబు, రాజేష్ ముదిరాజ్, ఉప్పల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు రామకృష్ణ, ఉప్పల్ డివిజన్ ప్రెసిడెంట్ ఈగ ఆంజనేయులు ముదిరాజ్, బజారు జగన్నాథ్ గౌడ్, తుమ్మల దేవి రెడ్డి, అశోక్, బజారు నవీన్ గౌడ్, అలీం, సత్తి రెడ్డి, మా శెట్టి రాఘవేంద్ర పాల్గొన్నారు.
Also Read: Terrarist Attack: అనంతనాగ్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు కానిస్టేబుల్ మృతి

వారితో పాటు.. పూజారి హనుమంతు, అన్వర్, అఫ్జల్, ప్రశాంత్ రెడ్డి,రంగుల శేఖర్, చిలకనగర్ డివిజన్ కొంపల్లి బాలరాజ్, చైతన్య గౌడ్, అమర్, మంచాల రఘు, డేవిడ్, తూర్పాటి జంగయ్య, గవ్వల సంతోష్, శ్రవణ్, దుర్గ, బాలచందర్ గౌడ్, రమేష్ గౌడ్, రాము గౌడ్,భీమ్ రాజ్, సాయిలు, గీత, సుశీల, నవాబ్, బాబు, అనూప్ చారి, వంశి, అమరేశ్వరి, శోభా రెడ్డి, సమతతో పాటు ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

