HomeతెలంగాణJagga Reddy: జగ్గారెడ్డిపై అక్రమ రవాణా కేసులో కోర్టు కీలక తీర్పు

Jagga Reddy: జగ్గారెడ్డిపై అక్రమ రవాణా కేసులో కోర్టు కీలక తీర్పు

Jagga Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి భారీ ఊరట లభించింది. మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డితో పాటు కాంగ్రెస్ నేత కుసుమ కుమార్‍పై నమోదైన కేసును గురువారం (మార్చి 26) ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కోట్టివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నమోదు చేసిన ఈ కేసులో జగ్గారెడ్డి (A1 ), కుసుమ కుమార్‍(A3)గా నిందితులుగా వారిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. నేటి విచారణలో వారిపై ఉన్న నేరారోపణలు రుజువు కాలేదని తెలుపుతూ వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.

- Advertisement -

2004లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జగ్గారెడ్డి నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి భార్య పిల్లలుగా పేర్కొంటూ వేరే ముగ్గురు వ్యక్తులను అమెరికాకు తీసుకువెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. తన వెంట ఒక మహిళ ఒక యువకుడిని అమెరికా తీసుకువెళ్లిన జగ్గారెడ్డి తిరిగి ఆయన ఒక్కరే భారత్‍కు తిరిగి వచ్చారని, నాడు ఎమ్మెల్యేగా, విప్ గా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ 2018లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లిన ఆయన బెయిల్ పై ఆయన బయటకు వచ్చారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News