Wednesday, February 11, 2026
Homeతెలంగాణహైదరాబాద్Hyderabad: హైదరాబాద్ కమిషనరేట్‌లో భారీ ప్రక్షాళన.. 54 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ!

Hyderabad: హైదరాబాద్ కమిషనరేట్‌లో భారీ ప్రక్షాళన.. 54 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ!

Hyderabad Police Commissionerate: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. పరిపాలనాపరమైన మార్పుల్లో భాగంగా ఒకేసారి 54 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లను (CIs) బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, అబిడ్స్ వంటి కీలక ప్రాంతాల స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో (SHO) పాటు క్రైమ్ విభాగాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి.

- Advertisement -

బదిలీల వెనుక ముఖ్య ఉద్దేశాలు: గత కొంతకాలంగా ఒకే విభాగంలో లేదా స్టేషన్‌లో కొనసాగుతున్న వారిని నిబంధనల ప్రకారం మార్చాలనే ఉద్ధేశంతో ఈ బదిలీలు జరిగినట్లుగా తెలుస్తోంది. నగరంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS), సైబర్ క్రైమ్ విభాగాల్లో నూతన సంస్కరణలు చేపట్టడం. శాంతిభద్రతల పరిరక్షణ మరియు ఎన్నికల విధులను దృష్టిలో ఉంచుకుని సమర్థులైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడం వంటి అంశాలు సైతం బదిలీల వెనుక ముఖ్య కారణాలుగా తెలుస్తోంది.

Also read-GHMC Traffic: హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి యువ ఐపీఎస్‌ ఆఫీసర్ల నియామకం

కీలక ఆదేశాలు: బదిలీ అయిన వారిలో 26 మంది ఇన్‌స్పెక్టర్లను తక్షణమే విధుల నుండి రిలీవ్ కావాలని సీపీ ఆదేశించారు. వీరందరూ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సైబర్ క్రైమ్ విభాగం నుండి పెద్ద సంఖ్యలో అధికారులను బదిలీ చేయడం వెనుక ఆ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలనే లక్ష్యం కనిపిస్తోంది. కీలకమైన పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలను మార్చడంతో నగరవ్యాప్తంగా ఈ బదిలీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News