Thursday, March 12, 2026
HomeTop StoriesHyderabad: భాగ్యనగరంలో భారీగా పోలీస్ బదిలీలు.. 63 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం!

Hyderabad: భాగ్యనగరంలో భారీగా పోలీస్ బదిలీలు.. 63 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం!

Police Department: హైదరాబాద్‌లో పోలీస్ శాఖలో పరిపాలనా సౌలభ్యం కోసం భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొత్తం 63 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిటీ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డ్ సమావేశం నిర్ణయం మేరకు ఈ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

- Advertisement -

కీలక స్టేషన్లకు కొత్త బాస్‌లు: బదిలీ అయిన వారిలో చాలామంది కీలక పోలీస్ స్టేషన్లకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా (SHO) నియమితులైనట్లు తెలుస్తోంది. మరికొందరు స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్, క్రైమ్ విభాగాలకు సైతం బదిలీ అయ్యారు.

వెంటనే విధుల్లో చేరాలని ఆదేశం: బదిలీ అయిన అధికారులు అందరూ తక్షణమే పాత బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని సీపీ ఆదేశించారు. ఆలస్యం చేయకుండా తమకు కేటాయించిన కొత్త పోస్టింగ్‌లలో రిపోర్ట్ చేయాలని సూచించింది. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఉన్నతాధికారులు కంప్లయన్స్ రిపోర్ట్ (Compliance Report) సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా నియమితులైన అధికారులు:

  • చార్మినార్ ఎస్‌ఎచ్‌ఓ(SHO): టి. రాంబాబు (స్పెషల్ బ్రాంచ్ నుంచి)
  • జూబ్లీహిల్స్ ఎస్‌ఎచ్‌ఓ(SHO): యు. శ్రీనివాసులు రెడ్డి (సైఫాబాద్ నుంచి)
  • సైఫాబాద్ ఎస్‌ఎచ్‌ఓ(SHO): ఎ. సీతయ్య (ఫలక్‌నుమా నుంచి)
  • అఫ్జల్‌గంజ్ ఎస్‌ఎచ్‌ఓ(SHO): ఎన్. మోహన్ రావు (ఛత్రినాక ట్రాఫిక్ నుంచి)
  • ఛత్రినాక ఎస్‌ఎచ్‌ఓ(SHO): ఎస్. కోటేశ్వర్ రావు (ఆసిఫ్‌నగర్ ట్రాఫిక్ నుంచి)

విభాగాల వారీగా నియామకాలు: కేవలం లా అండ్ ఆర్డర్ మాత్రమే కాకుండా క్రైమ్, ట్రాఫిక్, మరియు ప్రత్యేక విభాగాల్లోనూ మార్పులు జరిగాయి.

  • షీ టీమ్స్ (SHE Team): బాధ్యతలను టి. వంశీ కృష్ణ రావుకు అప్పగించారు.
  • భరోసా సెంటర్: బాధ్యతలను పల్లె పద్మకు కేటాయించారు.
  • సైబర్ క్రైమ్: కె. నారాయణ రెడ్డి, యు. చంద్రశేఖర్‌లు ఈ విభాగానికి బదిలీ అయ్యారు.
  • స్పెషల్ బ్రాంచ్: వెయిటింగ్‌లో ఉన్న కె. శ్రీనివాసులు, ఆదిరెడ్డి, చంద్రశేఖర్, పరశురామ్ తదితరులకు ఇక్కడ పోస్టింగ్‌లు లభించాయి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News