Homeతెలంగాణహైదరాబాద్OU employee: కదులుతున్న రైలు దిగబోయి ప్రమాదం.. చికిత్స పొందుతూ ఓయూ ఉద్యోగి మృతి

OU employee: కదులుతున్న రైలు దిగబోయి ప్రమాదం.. చికిత్స పొందుతూ ఓయూ ఉద్యోగి మృతి

సికింద్రాబాద్ (తెలుగుప్రభ): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తు కిందపడటంతో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. జీఆర్పీ సికింద్రాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా మడికొండకు చెందిన తాళ్లపల్లి నరసింగ్ రావు (54) ఉస్మానియా విశ్వవి ద్యాల యంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 5న మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని 8వ నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద కదులుతున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కాలు జారి రైలు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలుకు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ సమాచారం మేరకు క్షతగాత్రుడిని వెంటనే మెడికవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు .అయితే, చికిత్స పొందుతున్న సమయంలో రక్తపోటు (బీపీ) అధికమవడంతో గురువారం ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై జీఆర్పీ సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Also Read: MMC Commissioner: పెండింగ్ బిల్డింగ్ అనుమతులపై ఎంఎంసీ కమిషనర్ ఆకస్మిక సమీక్ష

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News