Saturday, March 14, 2026
Homeతెలంగాణహైదరాబాద్Adulterous Food: బేగంబజార్‌లో కల్తీ టీ పౌడర్‌, సర్ఫ్‌ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్‌

Adulterous Food: బేగంబజార్‌లో కల్తీ టీ పౌడర్‌, సర్ఫ్‌ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్‌

Adulterous Food in Begumbazar: తెలుగు రాష్ట్రాల్లో కల్తీ ముఠాల ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. అప్పుడే పుట్టిన పిల్లల కోసం తయారు చేసే పాల పౌడర్‌ నుంచి పెద్దలు తినే ప్రతి ఆహారం వరకూ కల్తీ లేని పదార్థమంటూ లేదు. కల్తీ పదార్థాలు తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు, అధికారులు ఎన్ని దాడులు చేపడుతున్నా ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. హైదరాబాద్‌ మహా నగరంలో తాజాగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిర్వహించిన దాడుల్లో కల్తీ టీ పౌడర్‌, సర్ఫ్‌ను పట్టుకున్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/lovers-suicide-in-in-the-forests-of-rapur-ghat-road-nellore/

బేగంబజార్‌లో కల్తీ టీ పౌడర్‌, సర్ఫ్‌ పౌడర్‌ను హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. రసాయనాలతో నకిలీ టీ పౌడర్‌ తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కల్తీ పౌడర్‌కు బ్రాండెడ్‌ లేబుల్స్‌ వేసి మార్కెట్‌లో అమ్మకాలు సాగినట్లుగా విచారణలో తేలింది. ఇందుకోసం కల్తీ ముఠా గుజరాత్‌ నుంచి బ్రాండెడ్‌ లేబుల్స్‌ దిగుమతి చేసుకుంటోందని తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. కల్తీ పదార్థాలకు బ్రాండెడ్‌ లేబుల్స్‌ వేసి బేగంబజార్‌లోని హోల్‌సేల్ దుకాణాలకు నకిలీ టీ పొడి, సర్ఫ్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News