Homeతెలంగాణహైదరాబాద్TKR College: టీకేఆర్‌ కాలేజీలో ఏఐపై ట్రైనింగ్‌.. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కు భారీ స్పందన

TKR College: టీకేఆర్‌ కాలేజీలో ఏఐపై ట్రైనింగ్‌.. ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కు భారీ స్పందన

Huge Response to Faculty Development Program on AI Training at TKR College: “ఇంటిగ్రేషన్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇన్ హెల్త్‌కేర్, అగ్రికల్చర్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్” అనే అంశంపై ఏఐసీటీఈ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ (ఏటీఏఎల్) అకాడమీ సంయుక్తంగా ఆరు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌డీపీ)ను హైదరాబాద్‌లోని టీకేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో 20 జూలై నుండి 25 వరకు దిగ్విజయంగా నిర్వహించింది. ఈ ఎఫ్‌డీపీకి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి), గీతం యూనివర్సిటీ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యూఓహెచ్), జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) నుండి ప్రముఖ నిపుణులు హాజరయ్యారు. వీరు క్వాంటం కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ (క్యూఎంఎల్), అల్గారిథమ్స్,న్యూరల్ నెట్‌వర్క్స్ (క్యూఎన్‌ఎన్), ఫోటోనిక్ క్వాంటం కమ్యూనికేషన్ వంటి అంశాలపై విలువైన సలహాలు, సూచనలు అందించారు. ఈ సెషన్‌లో పాల్గొన్నవారికి క్వాంటం టెక్నాలజీలోని తాజా అప్‌డేట్స్‌, వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానించడంపై ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌తో పాటు ఆచరణాత్మక అవగాహనను కూడా అందించాయి.

- Advertisement -

Also read: Registration : ఓటు హక్కు… ఖానాపూర్‌లో వేగవంతంగా ‘ఎస్‌ఐఆర్’ ఓటరు నమోదు ప్రక్రియ

ఏఐపై హ్యాండ్స్-ఆన్ ట్రైనింగ్‌ సెషన్‌..

ఈ కార్యక్రమంలో అనేక హ్యాండ్స్-ఆన్ శిక్షణా సెషన్‌లు నిర్వహించబడ్డాయి. వీటిలో పాల్గొన్నవారు ఐబీఎం క్విస్కిట్‌ను ఇన్‌స్టాల్ చేసి, ఉపయోగించడం నేర్చుకోవడంతో పాటు హెల్త్‌కేర్ డయాగ్నోస్టిక్స్ కోసం క్వాంటం మెషిన్ లెర్నింగ్, క్విస్కిట్‌తో క్యూఏఓఏ ఉపయోగించి క్వాంటం ఆప్టిమైజేషన్, ఫోటోనిక్ క్యూబిట్‌లను ఉపయోగించి క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (క్యూకేడీ) ప్రోటోకాల్స్, బైనరీ క్లాసిఫికేషన్ కోసం క్వాంటం న్యూరల్ నెట్‌వర్క్‌లను (క్యూఎన్‌ఎన్‌) అమలు చేయడంలో ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ పొందారు. ప్రస్తుత పరిశోధనా ధోరణులను అన్వేషించడానికి, వారి పరిశోధన, ప్రచురణను బలోపేతం చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తూ, ఒక వ్యాస చర్చా కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఎఫ్డీపీలో భాగంగా, పాల్గొన్నవారు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్‌)ని సందర్శించి, అక్కడ క్వాంటం కంప్యూటింగ్ ప్రయోగశాలను పరిశీలించారు. ఈ పారిశ్రామిక సందర్శన సమయంలో పాల్గొన్నవారు క్వాంటం సిమ్యులేటర్లు, క్వాంటం ఆప్టిమైజేషన్ అప్లికేషన్లు, క్వాంటం న్యూరల్ నెట్‌వర్క్ పరిశోధనలపై విలువైన అవగాహన పొందారు. తద్వారా ఈ రంగంలోని అత్యాధునిక పరిణామాలపై వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్‌ లభించింది. ప్రిన్సిపాల్ డా. ఎ. రామస్వామి రెడ్డి, కాలేజీ యాజమాన్యం, ఎఫ్‌డీపీ కోఆర్డినేటర్ డి. కవిత తదితరులు పాల్గొన్నారు. నిర్వాహక కమిటీ అందించిన నిరంతర ప్రోత్సాహం, మద్దతుతో ఈ కార్యక్రమ నిర్వహణ విజయవంతమైంది. ఈ కార్యక్రమాన్ని ఘనవిజయంగా మలచడంలో తమ వంతు సహకారం అందించిన విశిష్ట నిపుణులకు, ఏఐసీటీఈ ఎటిఎఎల్ అకాడమీకి, పాల్గొన్న వారందరికీ ప్రిన్సిపాల్, కాలేజ్ యాజమాన్య కోఆర్డినేటర్,నిర్వాహక కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News