Hyderabad Traffic Alert: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ నేపథ్యంలో నగరంలోని కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు మల్కాజిగిరి సీపీ సుమతి తెలిపారు. మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ చిక్కుల్లో పడకుండా ఉండేందుకు మెట్రో సేవలను వినియోగించుకోవాలని కోరారు.
- Advertisement -
ప్రత్యామ్నాయ మార్గాల వివరాలు:
- బేగంపేట – సంగీత్ జంక్షన్: బేగంపేట నుండి సంగీత్ వైపు వెళ్లే వారు.. ప్యారడైజ్, పాట్నీ, క్లాక్ టవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
- బేగంపేట- తిరుమలగిరి: ఈ మార్గంలో ప్రయాణించే వారు ఫ్లైఓవర్లు, సెయింట్ జాన్స్ రోటరీ, షెనాయ్ నర్సింగ్ హోం, ఏఓసీ సెంటర్, కేవీ మీదుగా తిరుమలగిరి చేరుకోవాలి.
- బాలానగర్- సికింద్రాబాద్: బాలానగర్ నుండి వచ్చే వాహనాలను బాలానగర్ జంక్షన్, ఫతేనగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, బేగంపేట వైపు మళ్లించనున్నారు.
- పంజాగుట్ట వైపు నుండి: పంజాగుట్ట, బేగంపేట, రసూల్‌పురా జంక్షన్, మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్ చేరుకోవచ్చు.
- సికింద్రాబాద్ – బోయిన్‌పల్లి: క్లాక్ టవర్, పాట్నీ, ప్యారడైజ్, సీటీఓ మీదుగా బోయిన్‌పల్లికి వెళ్లాలి.
- ట్యాంక్ బండ్ – తిరుమలగిరి: ప్యారడైజ్, సీటీఓ, తాడ్‌బండ్, డైమండ్ పాయింట్, బోయిన్‌పల్లి మార్కెట్ మీదుగా తిరుమలగిరికి చేరుకోవచ్చు.

