- స్పెషల్ డ్రైవ్ ఫేజ్ ద్వారా ఆగష్టు 11వరకు అడ్మిషన్లు
ఉప్పల్ (తెలుగు ప్రభ): ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దోస్త్ ప్రత్యేక డ్రైవ్ దశ ప్రకటన వెలుబడింది. ఇంటర్మీడియట్‌లో బైపీసీ, ఎంపీసీతో చదివిన విద్యార్థులను వెంటనే నమోదు/ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా ప్రిన్సిపాల్ డాక్టర్. కె.విజయ్ కుమార్ కోరారు. దోస్త్ కన్వీనర్ జె.విశ్వనాథ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం నమోదుకు ఆగస్ట్ 11 చివరి తేదీ కాగా, వెబ్ ఆప్షన్లకు ఆగస్ట్ 12 చివరి తేదీ అని గుర్తు చేశారు. సీట్ల కేటాయింపు ఆగస్ట్ 14న జరుగుతుందని తెలిపారు. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, కళాశాలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఆగస్ట్ 18 చివరితేదీ అని తెలిపారు. అన్ని రకాల సహాయం కోసం కళాశాల కార్యాలయాన్ని సందర్శించవచ్చని 8686939844, 8985927019లను సంప్రదించవచ్చని తెలియజేశారు. కళాశాల దోస్త్ కోడ్ 12816 అని తెలిపారు.
Also Read: Kharge : మోదీ మౌనం వీడాలి.. అమిత్ షా జవాబు చెప్పాలి!

