Homeతెలంగాణహైదరాబాద్Balkampet Yellamma: వైభవంగా బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణోత్సవం.. పాల్గొన్న మర్రి శశిధర్ రెడ్డి

Balkampet Yellamma: వైభవంగా బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణోత్సవం.. పాల్గొన్న మర్రి శశిధర్ రెడ్డి

బేగంపేట్ (తెలుగు ప్రభ): బల్కంపేట్ శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవంలో మాజీ మంత్రి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిధర్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ యువ నాయకులు మర్రి పురురవ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్త లు కళ్యాణోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణలో సుభిక్షం నెలకొ నాలని అమ్మవారిని ప్రార్థించినట్లు వారు తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి కళ్యాణోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు.

- Advertisement -

Also read: Fake Bt-3 seed: నకిలీ బీటీ-3 విత్తనాల రాకెట్‌ భగ్నం.. ఆరుగురు అరెస్ట్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News