Homeతెలంగాణహైదరాబాద్Balkampet : శాకాంబరీ శోభితం.. నేత్రపర్వంగా ఎల్లమ్మతల్లి ఆషాఢ మహోత్సవం

Balkampet : శాకాంబరీ శోభితం.. నేత్రపర్వంగా ఎల్లమ్మతల్లి ఆషాఢ మహోత్సవం

సికింద్రాబాద్ (తెలుగుప్రభ): నగరంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన బల్కంపేట రేణుకా ఎల్ల మ్మతల్లిఆలయంలోఆషాడమా స వేడుకలు శోభాయమానంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆషాడ మంగళవారాన్ని పురస్కరించుకొని  అమ్మవారు శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో అమ్మవారిని మనోహరంగా అలంకరించారు.

- Advertisement -

వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పచ్చటి కూరగాయల అలం కరణలో దేదీప్యమానంగా భాసిల్లుతున్న ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అర్చకులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదాలను పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News